Telugu Global
Telangana

నిమ్స్‌లో విద్యార్థులను పరామర్శించిన మంత్రులు

విష అహారంతో అస్వస్థత పాలై హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు పరామర్శించారు.

నిమ్స్‌లో విద్యార్థులను పరామర్శించిన మంత్రులు
X

ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు త్వరగా కొలుకునే విధంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు వారు భరోసా కల్పించారు.

విష అహారంతో అస్వస్థత పాలై వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వారందరికి మంచి వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. వాంకిడి గురకులంలో ఫుడ్‌ పాయిజన్‌ తో 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ఎనిమిదో తరగతి విద్యార్థిని మహాలక్ష్మీ, తొమ్మిదో తరగతి స్టూడెంట్స్‌ జ్యోతి, శైలజకు నిమ్స్‌ లో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. వారిలో మహాలక్ష్మీ కోలుకున్నా, జ్యోతి ఆరోగ్య పరిస్థితి మెరుగు పరచడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారని తెలిపారు. శైలజకు వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తున్నారు

First Published:  5 Nov 2024 4:32 PM IST
Next Story