యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న మంత్రులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ మంత్రులు దర్శించుకున్నరు
BY Vamshi Kotas22 Nov 2024 4:31 PM IST

X
Vamshi Kotas Updated On: 22 Nov 2024 4:31 PM IST
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్టకు వచ్చిన మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి వారి దర్శనానంతరం మంత్రులకు అర్చక బృందం వేదాశీర్వచనం పలికారు.
కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా మంత్రులు వెల్లడించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట సందర్శన సందర్భంగా చేసిన ఆలయ అభివృద్ధి సమీక్ష మేరకు పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మంత్రులు వెంట స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్ రావు ఉన్నారు.
Next Story