నిమిషం కూడా కరెంట్ పోతలేదు..
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంట్ కోతలు మొదలయ్యాయనే విమర్శలున్నాయి. ఈమధ్య వర్షాలకు గంటలకొద్దీ పవర్‌కట్‌లు జరుగుతున్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కరెంట్ కోతలపై తమ సొంత అనుభవాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ కరెంట్ కోతలపై రోజూ చర్చ జరుగుతోంది. తమ తమ ఏరియాల్లో పవర్ కట్‌లపై జనాలు ప్రభుత్వానికి, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల వేళ రేవంత్ సర్కారుకు కరెంట్ కోతలు తలనొప్పిగా మారాయి.
ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడం లేదన్నారు ఉత్తమ్. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కంటే తాము నాణ్యమైన కరెంటు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు వచ్చిందని, కరెంటు పోతుందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.