Telugu Global
Telangana

'BRU' ట్యాక్స్ పై ఉత్తమ్ కుమార్ స్పందన

తమ హయాంలో డీఫాల్డ్‌ చేసే మిల్లర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీఫాల్ట్‌ మిల్లర్లతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కయ్యారని విమర్శించారు.

BRU ట్యాక్స్ పై ఉత్తమ్ కుమార్ స్పందన
X

తెలంగాణలో భట్టి, రేవంత్, ఉత్తమ్ పేర్లతో 'BRU' ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారని, కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ముగ్గురు కప్పం కడుతున్నారంటూ ఇటీవల కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఉత్తమ్ ని టార్గెట్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా ఉత్తమ్ స్పందించారు. తనపై బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోబోనన్నారు ఉత్తమ్.

బీజేపీ, బీఆర్ఎస్ కలసి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై విభాగం పరిస్థితి దారుణంగా ఉందని, 11వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉందన్నారు. మిల్లర్లపై చర్యలు తీసుకుంటే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ఉత్తమ్. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నవారు దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు.

తమ హయాంలో డీఫాల్డ్‌ చేసే మిల్లర్లకు మళ్లీ ధాన్యం ఇవ్వడం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీఫాల్ట్‌ మిల్లర్లతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కయ్యారని విమర్శించారు.సన్న బియ్యం ఎంత ఇస్తే, అంతా కొంటామని బదులిచ్చారు. తాను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని అనడం అవాస్తవం అని, కనీసం తాను వారిని కలవలేదని చెప్పారు ఉత్తమ్. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుందని, టెండర్‌లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా కొంటామని చెప్పారు. ఢిల్లీకి డబ్బులు పంపి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నారని, ఆయన అవగాహన రాహిత్యంతో తనపై విమర్శలు చేస్తున్నారని బదులిచ్చారు ఉత్తమ్.

First Published:  26 May 2024 9:32 PM IST
Next Story