Telugu Global
Telangana

వాళ్లకే రైతుబంధు.. తేల్చేసిన తుమ్మల

రాష్ట్రంలో కోటీ 11 లక్షల యాభై వేల ఎకరాలకు గాను 64.77 లక్షల మంది రైతులకు రూ.5,574.77 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామన్నారు తుమ్మల నాగేశ్వరరావు.

వాళ్లకే రైతుబంధు.. తేల్చేసిన తుమ్మల
X

ఇక నుంచి పంట వేసిన వాళ్లకే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రైతుబంధు ఎవరికి, ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతుబంధు సాయాన్ని అందజేస్తామన్నారు తుమ్మల.

రాష్ట్రంలో కోటీ 11 లక్షల యాభై వేల ఎకరాలకు గాను 64.77 లక్షల మంది రైతులకు రూ.5,574.77 కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. మరో 4 లక్షల మందికి ఈ నెలాఖరులోగా అందిస్తామన్నారు. పెట్టబడిసాయాన్ని మొదట గుంటలవారీగా జమ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. సంక్రాంతి ముందు వరకు కూడా నిధులు జమ స్పీడ్‌గా జరగలేదు. పండగ తర్వాత జమ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్. ప్రస్తుతం 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు ప్రభుత్వం చెప్తోంది.

మిగిలిన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇచ్చేవరకు నమ్మకం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా? లేదా? అన్న దానిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నిధుల జమ ప్రక్రియపై ప్రభుత్వంలోని మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.

First Published:  2 April 2024 7:43 AM IST
Next Story