Telugu Global
Telangana

మహేశ్‌కుమార్‌ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు జవాబు చెప్పాలె

కాంగ్రెస్‌లో చేరిన అరికపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా ఎలా చేస్తారని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేతలు

మహేశ్‌కుమార్‌ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్‌బాబు జవాబు చెప్పాలె
X

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఛైర్మన్‌ అరికపూడి గాంధీ అధ్యక్షతన ప్రజాపద్దుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీఏసీ సమావేశానికి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశాంత్‌రెడ్డి, ఎల్‌. రమణ, సత్యవతి రాథోడ్‌లు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ పీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, సత్యవతి రాథోడ్‌లో కలిసి మాట్లాడారు.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ ఛైర్మన్‌గా నియమించారు. క్రిష్ణారెడ్డి, గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కె.సి.వేణుగోపాల్‌ పీఏసీ ఛైర్మన్‌ అయ్యారు కానీ ఇక్కడ హరీశ్‌ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగాం. అలాగే పార్టీ ఫిరాయించిన వారికి పీఏసీ ఛైర్మన్‌ ఎలా చేస్తారంటే దీనికి మంత్రి శ్రీధర్‌ బాబు మాత్రం అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలి. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్ గా నియమించాలని సూచించారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు.ఆస్తులు కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీ మారారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. దీనికి ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు హైకమాండ్‌ ఆలోచలనకు విరుద్ధంగా జరుగుతున్నాయన్న జీవన్‌రెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన వీడియోను ప్రశాంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులకు చూపెట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అన్నది హైకమాండ్‌ జీవన్‌రెడ్డి వివరంగా చెప్పిందన్నారు. జీవన్‌రెడ్డి మాత్రం రాహుల్‌ ఆలోచనలకు భిన్నంగా రాష్ట్రంలో పార్టీలో చేరికలు ఉన్నాయన్న దానికి సమాధానం ఇస్తూ.. హైకమాండ్‌ సూచనల మేరకే పార్టీలోకి చేర్చకున్నామన్నారు.వీళ్లంతా పార్టీ మారలేదని చెప్పిన దీనికి మంత్రి శ్రీధర్‌ బాబు సమాధానం చెప్పాలని ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు:సత్యవతి రాథోడ్

ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బుల్డోజ్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. అరికెపూడి గాంధీని అక్రమంగా పీఏసీ ఛైర్మన్‌గా నియమించారని విమర్శించారు. పీఏసీ చైర్మన్ గా ఎవరు ఉండాలో నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్ కు ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పినా చర్యలు తీసుకోలేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ ఇచ్చారు. అరికేపూడి గాంధీ, పట్నం మహేందర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాంప్రదాయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.

ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం తిలోదకాలు :ఎల్.రమణ

ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. రేవంత్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. పీఏసీ ఛైర్మన్‌ పదవి ప్రభుత్వంలో కీలకంగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన ఖర్చులపై పీఏసీలో చర్చ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికేపూడి గాంధీకి ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి ఎట్లా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రశ్నించారు.

First Published:  28 Oct 2024 1:14 PM IST
Next Story