రేషన్‌కార్డుల జారీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పొన్నం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.
BY Telugu Global3 May 2024 8:31 AM IST
X
Telugu Global Updated On: 3 May 2024 8:31 AM IST
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్ధతుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో స్కీమ్స్ అమలు చేయలేకపోతున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పొన్నం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఓటు వేసే ముందు ఆలోచన చేయాలన్నారు పొన్నం.
Next Story