ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం ప్రభాకర్!
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి ఓ మహిళ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి పాల్గొన్నారు. కేక్ కట్టింగ్ తర్వాత పక్కనే ఉన్న ఓ మహిళకు బలవంతంగా కేక్ పూసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఆ మహిళ ఇబ్బంది పడుతున్నప్పటికీ..ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. ఈ ఘటన జరుగుతున్న టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉండడం గమనార్హం. మరో వీడియోలో తాను డ్యాన్సు చేస్తూ... సదరు మహిళను కూడా డ్యాన్స్ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇబ్బందిపెట్టడం కనిపించింది.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనా విమర్శలు వస్తున్నాయి. మహిళలు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారని ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.