రేవంత్‌రెడ్డికి మంత్రి నిరంజన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది దేనికైనా దారితీయొచ్చని రేవంత్‌ను హెచ్చరించారు.
ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే కుదరదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది దేనికైనా దారితీయొచ్చని రేవంత్‌ను హెచ్చరించారు.
కేసీఆర్ సర్కారు తెలంగాణ రైతులకు ఇస్తున్న కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టడంతో రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇష్టారీతిన మాట్లాడితే హీరో అయిపోతానని రేవంత్ తనకు తాను ఊహించుకుంటున్నాడన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి వాడే భాషను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌తో సిద్ధాంతపరంగా పోరాడాలి కానీ, వ్యక్తిగత ద్వేషంతో కాదని రేవంత్‌కు సూచించారు.