Telugu Global
Telangana

కరువు ప్రాంతం నుంచి కడుపు నింపేదాకా- కేటీఆర్ ట్వీట్‌

కేవలం 9 సంవత్సరాల కాలంలో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌ది కాదా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. 2022-23 కాలానికి ఆయా రాష్ట్రాలు వరి ధాన్యం ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కేటీఆర్ పోస్టు చేశారు.

కరువు ప్రాంతం నుంచి కడుపు నింపేదాకా- కేటీఆర్ ట్వీట్‌
X

కరువు ప్రాంతం నుంచి కడుపు నింపేదాకా- కేటీఆర్ ట్వీట్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అటు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన విజయాలను, ఘనతలను సోషల్‌మీడియా ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. తాజాగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన విజయానికి సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.

కరువు ప్రాంతం అని అనుకునే స్థాయి నుంచి తెలంగాణ దేశానికి అన్నం పెట్టె స్థాయికి ఎదగడం అంటే మాటలా..! కేవలం 9 సంవత్సరాల కాలంలో రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌ది కాదా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. 2022-23 కాలానికి ఆయా రాష్ట్రాలు వరి ధాన్యం ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కేటీఆర్ పోస్టు చేశారు.


ఈ జాబితాలో 160.14 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడితో తెలంగాణ టాప్‌ ప్లేసులో ఉండగా.. వెస్ట్‌బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఒడిశా వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 156 లక్షల మెట్రిక్ టన్నులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉండగా.. 151 లక్షల మెట్రిక్‌ టన్నులతో యూపీ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. 131 లక్షల టన్నులతో పంజాబ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రచార సభల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు రైతుబంధు, నీరు, ఉచిత కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్తున్నారు.

First Published:  16 Nov 2023 11:45 AM IST
Next Story