Telugu Global
Telangana

కమల్ హాసన్ గర్వపడేలా బీజేపీ నటన.. కేటీఆర్ ట్వీట్

ఈ వీడియోకి ఫినిషింగ్ టచ్ మంత్రి కేటీఆర్ ఇచ్చారు. ఈ మహానటుడ్ని చూస్తే కమల్ హాసన్ కూడా గర్వపడతారంటూ ట్వీట్ వేసి ఓ రేంజ్ లో పంచ్ విసిరారు కేటీఆర్.

కమల్ హాసన్ గర్వపడేలా బీజేపీ నటన.. కేటీఆర్ ట్వీట్
X

మునుగోడు పోలింగ్ వేళ బీజేపీ నేతలు ఎన్ని వేషాలు వేశారో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్వయానా ఫేక్ ఓటు వేసి జనాలను మోసం చేశారు. తాను ఓటు వేశానంటూ ట్విట్టర్లో పెట్టుకున్నారు, చివరకు సోషల్ మీడియాలో రచ్చ జరిగే సరికి ఆ ట్వీట్ డిలీట్ చేసి చప్పుడు చేయకుండా సైలెంట్ అయ్యాడు. అలాంటి మేధావులు బీజేపీలో చాలామందే ఉన్నారు. ఇదిగో ఇక్కడ బోర్లా పడుకుని ఏడుస్తున్న ఓ చోటా నాయకుడ్ని చూడండి. ఇలాంటి వారిని చూసి క్యూలైన్లో ఉన్న ఓటర్లు కూడా చీదరించుకున్నారు. ఇక టీఆర్ఎస్ నేతలు వదిలిపెడతారా..? ఈ యాక్షన్ ఎపిసోడ్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఈ వీడియోకి ఫినిషింగ్ టచ్ మంత్రి కేటీఆర్ ఇచ్చారు. ఈ మహానటుడ్ని చూస్తే కమల్ హాసన్ కూడా గర్వపడతారంటూ ట్వీట్ వేసి ఓ రేంజ్ లో పంచ్ విసిరారు కేటీఆర్.

ఎవరా మహానటుడు..? ఏమా కథ..?

మునుగోడు పోలింగ్ కేంద్రం వద్ద లాల్చీ ధరించి బొట్టు పెట్టుకున్న ఓ చోటా నాయకుడి హడావిడి ఎపిసోడ్ ఇది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోతున్న సదరు చోటా లీడర్ ని పోలీసులు ఆపారు. జేబులో మొబైల్ ఫోన్ ఉండకూడదని చెప్పారు. దీంతో సదరు నాయకుడు ఆ ఫోన్ ని దూరంగా విసిరేశాడు, అతని స్నేహితుడు ఆ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. ఈలోగా ఫోన్ విసిరేసిన వ్యక్తి పోలింగ్ బూత్ ఆవరణలో పరుగందుకున్నాడు. కేఏపాల్ కంటే వేగంగా పరిగెత్తి క్యూలైన్లు ఉన్నచోటకు చేరుకున్నాడు. ఇక అక్కడినుంచి డ్రామా మొదలైంది.

పోలీసులు కొట్టారు బాబోయ్..!!

పోలీసులు నన్ను కొట్టారంటూ ఏడుస్తూ ఆ వ్యక్తి నేలపై పడుకుని పొర్లాడాడు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తున్నవారికి అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు కిందపడి దొర్లుతున్నాడో అర్థం కాలేదు. పోలీసులు కూడా ఏం జరిగింది, ఏం జరిగింది అంటూ ప్రశ్నించారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తనను పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడ్చాడు. అక్కడున్నవారందర్నీ తన నటనతో ఆశ్చర్యపరిచాడు. ఇది మోదీ యాక్టింగ్ స్కూల్ మహిమ అంటూ ట్వీట్ వేశారు టీఆర్ఎస్ నాయకులు. దీన్ని రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఈ నటన చూస్తే కమల్ హాసన్ కూడా గర్విస్తాడంటూ సెటైర్ పేల్చారు.

First Published:  5 Nov 2022 4:57 PM IST
Next Story