సిటీలో కేటీఆర్‌ రోడ్‌ షోలు.. ఇదే షెడ్యూల్‌.! | Minister KTR's road shows in Hyderabad city.. This is the schedule
Telugu Global
Telangana

సిటీలో కేటీఆర్‌ రోడ్‌ షోలు.. ఇదే షెడ్యూల్‌.!

నవంబర్ 28 నాటికి అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు ముగిసేలా ప్ర‌ణాళిక రూపొందించారు. వీటితో మరో 12 నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్‌ షోలు నిర్వహిస్తారు.

సిటీలో కేటీఆర్‌ రోడ్‌ షోలు.. ఇదే షెడ్యూల్‌.!
X

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌, బీజేపీల వైఖరిని ఎండగడుతున్నారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న యువత‌ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు.

ఇక త్వరలోనే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేటీఆర్. సిటీలో ఎన్నిక‌ల‌ ప్రచార బాధ్యతలు పూర్తిగా కేటీఆర్ తీసుకోనున్నారు. ఇందులో భాగంగా GHMC పరిధిలోని నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. నవంబర్‌ 15 నుంచి కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 28 నాటికి అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు ముగిసేలా ప్ర‌ణాళిక రూపొందించారు. వీటితో మరో 12 నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్‌ షోలు నిర్వహిస్తారు.

సిటీలోని కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, అంబర్‌పేట్‌, ముషీరాబాద్, గోషామహల్‌, సికింద్రాబాద్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ నవంబర్ 15 నుంచి 22 మధ్య రోడ్‌ షోలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ రోడ్‌ షోలు ఉంటాయి.

First Published:  8 Nov 2023 2:25 AM
Next Story