Telugu Global
Telangana

కేటీఆర్ దెబ్బకి 'జుమ్లా' ఆ లిస్ట్ లో చేరిపోయింది..

'జుమ్లా మోదీ' అంటూ పదే పదే కేటీఆర్ తన ట్వీట్స్ లో మోదీని టార్గెట్ చేసేవారు. కేటీఆర్ వాడే సరికి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

కేటీఆర్ దెబ్బకి జుమ్లా ఆ లిస్ట్ లో చేరిపోయింది..
X

జుమ్లా మోదీ, జుమ్లా సర్కార్, జుమ్లా ప్రధాని.. ఈ పదాలు ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఆ మాటకొస్తే అసలు వాటిని ట్రెండింగ్ లోకి తెచ్చింది తెలంగాణ మంత్రి కేటీఆర్ అని చెప్పుకోవాలి. కేటీఆర్ తన ట్వీట్స్ లో ప్రధాని మోదీని 'జుమ్లా' అని సంబోధించడం బాగా హైలైట్ అయింది. 'జుమ్లా మోదీ' అంటూ పదే పదే కేటీఆర్ తన ట్వీట్స్ లో మోదీని టార్గెట్ చేసేవారు. అంతకు ముందునుంచీ ఆ పదం ఉన్నా కూడా.. కేటీఆర్ వాడే సరికి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఆ ట్రోలింగ్ బాగా ట్రెండింగ్ లోకి రావడంతో ఇప్పుడు ఆ 'జుమ్లా' పదం ఏకంగా అన్ పార్లమెంటరీ పదాల లిస్ట్ లోకి చేరిపోయింది.

మోదీకి 'జుమ్లా' భయం..

రాబోయే వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు మోదీ సర్కారుపై విరుచుకుపడటం ఖాయం. ఇటీవల గ్యాస్ బండతో బాదేశారు, అగ్నిపథ్ తో నిప్పు పెట్టారు, మహారాష్ట్రలో చిచ్చుపెట్టారు, గోవాలో ఎమ్మెల్యేలను కొంటున్నారు, దేశంలో అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోయాయి, నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ దశలో వర్షాకాల సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. కచ్చితంగా పార్లమెంట్ లో 'జుమ్లా' అనే పద ప్రయోగం వినిపించే అవకాశముంది. 'జుమ్లా మోదీ'.. అంటే బూటకపు హామీలతో మోసం చేసే మోదీ అంటూ ఎవరైనా అంటారేమోనని ముందుగానే ప్రధాని భయపడ్డారు. ఆయన భయం కారణంగానే ఇప్పుడు 'జుమ్లా' అనే పదం 'అన్ పార్లమెంటరీ వర్డ్స్' లిస్ట్ లో చేరింది.

జుమ్లాతోపాటు, శకుని, బాజ్ బుద్ధి, కొవిడ్ స్ప్రైడర్, స్నూప్ గేట్, అషేమ్డ్, అబ్యూజ్డ్, బిట్రేయ్డ్, కరప్ట్, డ్రామా, హిపోక్రసీ వంటి పదాలను కూడా 'అన్ పార్లమెంటరీ వర్డ్స్' లిస్ట్ లో చేరుస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఓ బుక్ లెట్ విడుదల చేసింది. అనార్కిస్టు (అరాచకవాది), జైచంద్‌ (ద్రోహి) వినాశ్‌ పురుష్‌ (వినాశకారి), చీటర్‌ (మోసకారి), నికమ్మా (దద్దమ్మ) బేహ్రీ సర్కార్‌ (చెవిటి ప్రభుత్వం), బ్లడ్‌షెడ్‌ (రక్తపాతం), డాంకీ(గాడిద) వంటి పదాలను కూడా పార్లమెంట్ చర్చల్లో ఎవరూ ప్రస్తావించకూడదని హుకుం జారీ చేశారు. అలాంటి పదాలు ఉపయోగిస్తే వెంటనే స్పీకర్ వాటిని రికార్డులనుంచి తొలగిస్తారు.

First Published:  14 July 2022 2:14 AM GMT
Next Story