Telugu Global
Telangana

తెలంగాణకు అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్

సెన్సార్, పవర్ సొల్యూషన్స్‌, సెమీ కండక్టర్ల తయారీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోంది అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్.

తెలంగాణకు అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్
X

టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి సంస్థలన్నీ తెలంగాణకు క్యూ కడుతున్నాయి. తాజాగా అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్ సంస్థ తెలంగాణలో ఇ మొబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ ఇ మొబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నందుకు ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు.


సెన్సార్, పవర్ సొల్యూషన్స్‌, సెమీ కండక్టర్ల తయారీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోంది అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్. బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవర్ సొంతం చేసుకున్న అల్లెగ్రో మైక్రో సిస్టమ్స్ 10వేలమందికి పైగా కస్టమర్లకు తమ సేవలను అందిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో తమ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్ లో ప్రారంభించే ఇ-మొబిలిటీ కేంద్రం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కి సంబంధించిన డొమైన్లపై సంస్థ దృష్టిపెడుతుంది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీతో కలసి పనిచేయడం ద్వారా అద్భుతమైన పని వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యక్షంగా 500మంది నిపుణులకు ఈ సంస్థ ఉపాధి కల్పిస్తుంది. సరికొత్త ఇంజనీరింగ్ ఆవిష్కరణలు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ ల అభివృద్ధిలో ఈ నిపుణులు తమ ప్రత్యేకత చూపిస్తారు.

First Published:  7 July 2023 5:11 PM IST
Next Story