పోలింగ్ సరళి పరిశీలించిన మంత్రి కేటీఆర్
నగరంలోని పలు పోలింగ్ బూత్ లకు వెళ్లారు మంత్రి కేటీఆర్. పోలింగ్ బూత్ ల బయట ఉన్న ఓటర్లను ఆయన పలకరించారు. ఓటింగ్ తీరు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం సతీసమేతంగా జూబ్లీ హిల్స్ నంది నగర్ పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్.. అనంతరం పలు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళి పరిశీలించారు. పోలింగ్ ఎలా జరుగుతోంది, పోలింగ్ బూత్ లలో సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ తీరు గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కేటీఆర్.
నగరంలోని పలు పోలింగ్ బూత్ లకు వెళ్లారు మంత్రి కేటీఆర్. పోలింగ్ బూత్ ల బయట ఉన్న ఓటర్లను ఆయన పలకరించారు. ఓటర్లు కూడా మంత్రితో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపించారు. ఓటు వేసి వస్తున్న పలువురితో కేటీఆర్ మాట్లాడారు. పోలింగ్ బూత్ కనుక్కోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
మందకొడిగా పోలింగ్..
తెలంగాణలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 36.68శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మరో గంటన్నర మాత్రమే పోలింగ్ కి టైమ్ ఉంది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మరో అరగంటలో అంటే.. 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగతా అన్ని చోట్ల పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి ఉన్నవారికి మాత్రమే లోపలికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
♦