Telugu Global
Telangana

అర్బన్‌ ఓటర్లకు కేటీఆర్‌ విజ్ఞప్తి

కేసీఆర్ హయాంలో గడచిన తొమ్మిదిన్నరేళ్లలో కొత్త శిఖరాలు చేరుకున్నామని, ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా అధికారం చేపట్టి మరింత ముందుకెళ్తామని అన్నారు కేటీఆర్.

కేటీఆర్‌
X

కేటీఆర్‌

అర్బన్ ఓటర్లను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అర్బన్ ఏరియాల్లో 50శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదవుతుందని, ప్రతిసారీ గణాంకాలు ఇలాగే ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అర్బన్ ఓటింగ్ పెరగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నవంబర్‌ 30వ తేదీన ఓటు హక్కు ఉన్న వారంతా పోలింగ్‌ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఓటేస్తారనేది వేరే విషయం, ఓటు హక్కు వినియోగించుకున్నారా లేదా అనేదే ముఖ్యం అని చెప్పారు కేటీఆర్. ఓటు అనే పవర్‌ ను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సందేశమిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తోటివారిని కూడా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఓటూ ముఖ్యమేనని అన్నారు కేటీఆర్.


హైదరాబాద్ రోడ్ షో లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కేటీఆర్. అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు అని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి తమవంతు కృషి చేశామని, మరిన్ని పనులు చేయాల్సి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో గడచిన తొమ్మిదిన్నరేళ్లలో కొత్త శిఖరాలు చేరుకున్నామని, ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి కూడా అధికారం చేపట్టి మరింత ముందుకెళ్తామని అన్నారు కేటీఆర్.

గతంలో కూడా అర్బన్ ఓటింగ్ పై మంత్రి కేటీఆర్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. ఎక్కడికక్కడ పోల్ స్ట్రాటజీ అమలు చేయాలని ఆయన నాయకులకు సూచించారు. ముఖ్యంగా బూత్ లెవల్ ఇన్ చార్జ్ లు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్లను మోటివేట్ చేయాలన్నారు. ఎక్కడికక్కడ కాలనీల్లో ఓటింగ్ ముందు చర్చలు జరగాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఓటింగ్ అంటే పట్టణాల్లో చాలామంది హాలిడే అనుకుంటారని, కానీ సెలవు ఇచ్చేది ఓటు హక్కు వినియోగించుకోడానికేనని తెలిపారు కేటీఆర్.

First Published:  18 Nov 2023 11:52 AM IST
Next Story