Telugu Global
Telangana

మా సీఎం ఇమాన్ దార్.. మా ప్రభుత్వం జిమ్మేదార్

తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిష్తేదార్ అని, తెలంగాణ ప్రజలకు వఫాదార్ అని అన్నారు కేటీఆర్. తాము అమలు చేస్తున్న ప్రతి పథకం దిల్ దార్, తమ ప్రతి నిర్ణయం దమ్ దార్ అని చెప్పారు.

మా సీఎం ఇమాన్ దార్.. మా ప్రభుత్వం జిమ్మేదార్
X

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే కాంగ్రెస్, బీజేపీ అని విమర్శించారు. ఆ పార్టీల వల్లే భారత్ అభివృద్ధిలో వెనకపడి ఉందన్నారు. AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, BJP అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని కొత్త నిర్వచనాలిచ్చారు కేటీఆర్.

అసమర్థ పాలన..

కాంగ్రెస్, బీజేపీ రెండూ అసమర్థ పాలనకు కేరాఫ్ అడ్రస్ అని ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. అవినీతి ప్రభుత్వాలకు ఆ రెండు పార్టీలు చిరునామా అని అన్నారు. దశాబ్దాల పాలనా వైఫల్యాల పాపం దేశానికి, రాష్ట్రానికి శాపమై ఇంకా వెంటాడుతూనే ఉందన్నారు.

ఆ దమ్ములేకే..

తెలంగాణలో బీఆర్ఎస్ ని నేరుగా ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్, బీజేపీకి లేవని అన్నారు మంత్రి కేటీఆర్. అందుకే ఆ రెండు పార్టీలు కుటిల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. MIM భుజంపై తుపాకీపెట్టి BRSను కాల్చే కుట్ర బీజేపీ చేస్తోంటే.. BJP భుజంపై తుపాకీపెట్టి BRS ను కాల్చే కుతంత్రం కాంగ్రెస్ చేస్తోందన్నారు. వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని తెలంగాణ కాంగ్రెస్ వెన్నుముక లేని పార్టీగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా BRS అంటేనే భారత రైతు సమితి అని తేల్చి చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటేనే బేకార్ అని, కాంగ్రెస్ చరిత్ర అంతా భ్రష్టాచార్ అని, కాంగ్రెస్ ను నమ్ముకుంటే మళ్లీ అంధకార్ అని సెటైర్లు పేల్చారు.


రిష్తేదార్.. వఫాదార్..

తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిష్తేదార్ అని, తెలంగాణ ప్రజలకు వఫాదార్ అని అన్నారు కేటీఆర్. తాము అమలు చేస్తున్న ప్రతి పథకం దిల్ దార్, తమ ప్రతి నిర్ణయం దమ్ దార్ అని చెప్పారు. తెలంగాణ సీఎం ఇమాన్ దార్, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా జిమ్మేదార్ అని అన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన జోర్ దార్ అని ముక్తాయించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ధమాకేదార్ గా ఉండబోతాయని, దేశంలోనే తెలంగాణ మోడల్ అసర్ దార్ అని చెప్పారు మంత్రి కేటీఆర్.

First Published:  13 Aug 2023 12:02 PM IST
Next Story