నానమ్మకు కేటీఆర్ ఘన నివాళి.. ఏం చేశారంటే..?
ఆ బిల్డింగ్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి, నానమ్మను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆమెకు అమితమైన సంతోషం కలిగే సందర్భం ఇదని చెప్పారు.
ఈరోజు మా నాయనమ్మ ఉండి ఉంటే చాలా సంతోషపడేది అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ సొంత ఊరైన కోనాపూర్ లో స్కూల్ బిల్డింగ్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఆ బిల్డింగ్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి, నానమ్మను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆమెకు అమితమైన సంతోషం కలిగే సందర్భం ఇదని చెప్పారు.
My grandmother Venkatamma Garu will be pleased for sure
— KTR (@KTRBRS) July 9, 2023
As promised, have completed the construction of the Government School at Konapur village of Kamareddy constituency
Will be inaugurating it soon https://t.co/OgyQxLNDtk pic.twitter.com/PA0DOzJRZD
కోనాపూర్ లో అద్భుతంగా స్కూల్ బిల్డింగ్..
కామారెడ్డి జిల్లా కోనాపూర్ లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నూతన స్కూల్ బిల్డింగ్ నిర్మించారు. గతేడాది మేలో ఈ కొత్త బిల్డింగ్ కి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాయనమ్మ ఊరితో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ ఊరిలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు.
త్వరలో ప్రారంభం..
మనఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా కోనాపూర్ లో రెండున్నర కోట్ల రూపాయల సొంత నిధులతో కొత్త స్కూల్ బిల్డింగ్ నిర్మించారు మంత్రి కేటీఆర్. 2 అంతస్తుల్లో 14 క్లాస్ రూమ్ లు ఉండేట్టుగా ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. 9 నెలల్లో పని పూర్తి చేస్తామని శంకుస్థాపన రోజే మాటిచ్చారాయన. అన్నట్టుగానే పని పూర్తి చేశారు. త్వరలో ప్రారంభోత్సవం చేస్తామని ట్వీట్ చేశారు.