తెలంగాణ స్పీడ్.. ఫాక్స్ కాన్ పై కేటీఆర్ ట్వీట్
తెలంగాణ స్పీడ్ గురించి తెలిసిందే, అయితే తెలంగాణ లాగే యంగ్ లియు బృందం కూడా మంచి స్పీడ్ మీద ఉంది అని ప్రశంసించారు కేటీఆర్.
నెల రోజుల క్రితం భూమిపూజ చేసుకున్న కంపెనీ పనుల్లో పురోగతి ఏ స్థాయిలో ఉందో చూడండి అంటూ మంత్రి కేటీఆర్ ఫాక్స్ కాన్ ప్లాంట్ నిర్మాణ పనులకు సంబంధించిన ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. నెలరోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లో ఫాక్స్ కాన్ ప్లాంట్ కి భూమిపూజ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత స్పీడ్ గా పనులు మొదలుపెట్టడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణే కాదు మీరు కూడా స్పీడే..
ఈ సందర్భంగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు గతంలో చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో రాయదుర్గం ఐటీ కారిడార్ లో 18 ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో టీ వర్క్స్ ను ప్రారంభించుకున్న సందర్భంలో యంగ్ లియు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి చాలా అద్భుతం అన్నారు యంగ్ లియు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. తెలంగాణ మంచి స్పిరిట్ ఉన్న రాష్ట్రం అని, టి-వర్క్స్ లోనే కాదు మిగతా రంగాల్లో కూడా డెవలప్ మెంట్ ఉందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ స్పీడ్ తనకు బాగా నచ్చిందన్నారు యంగ్ లియు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది తెలంగాణ అని ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ స్పీడ్ గురించి తెలిసిందే, అయితే తెలంగాణ లాగే యంగ్ లియు బృందం కూడా మంచి స్పీడ్ మీద ఉంది అని ప్రశంసించారు కేటీఆర్.
Just over a month ago, we had broken ground for the Foxconn plant at Kongara Kalan in RR District
— KTR (@KTRBRS) June 25, 2023
Happy to share a glimpse of the brisk progress of the project
“Telangana speed” that the Foxconn chairman Mr. Young Liu alluded to is being adopted well by his team as well pic.twitter.com/CAY0z0TTJX
ఫాక్స్ కాన్ కంపెనీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ లో రూ.1,656 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పుతోంది. టీఎస్ఐఐసీకి చెందిన 200 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటవుతుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 35 వేలమందికి పరోక్షంగా మరో 30వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మే నెలలో ఫాక్స్ కాన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ప్రస్తుతం అక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి.