Telugu Global
Telangana

వేములవాడలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం

చివరిగా బీసీ బంధు చెక్కుల పంపిణీలో పాల్గొంటారు మంత్రి. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 600మంది లబ్ధిదారులకు కేటీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు.

వేములవాడలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శ్రీకారం
X

మంత్రి కేటీఆర్ వేములవాడ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. ముందుగా వేములవాడ పట్టణంలోని నంది కమాన్‌ జంక్షన్‌ ను మంత్రి ప్రారంభించారు. ఈ జంక్షన్ వద్ద రూపు రేఖలు మారిపోయాయని చెప్పిన కేటీఆర్, వేములవాడను సుందరంగా తీర్చిదిద్దిన అధికారులను అభినందించారు.


నందికమాన్ జంక్షన్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కేటీఆర్ చింతలతండా చేరుకున్నారు. అక్కడ 42 డబుల్ బెడ్‌ రూమ్ లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందిస్తారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ తోపాటు, డీఈఐసీ (DEIC) సెంటర్, మాతృసేవా కేంద్రాలను ప్రారంభిస్తారు. అదే ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటుని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ ను కూడా మంత్రి ప్రారంభిస్తారు. శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ ప్రారంభోత్సంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం తర్వాత గుడి చెరువు అభివృద్ధి పనులు, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. చివరిగా బీసీ బంధు చెక్కుల పంపిణీలో పాల్గొంటారు మంత్రి. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 600మంది లబ్ధిదారులకు కేటీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఇతర అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

First Published:  8 Aug 2023 12:18 PM IST
Next Story