Telugu Global
Telangana

మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చు పెడతారా..? కాంగ్రెస్ కి కేటీఆర్ సూటి ప్రశ్న

2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీల కోసం ఏం చేసిందని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చు పెడతారా..? కాంగ్రెస్ కి కేటీఆర్ సూటి ప్రశ్న
X

తెలంగాణలో మైనార్టీలు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. నిన్న కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్ అంతా బోగస్ అన్నారు. బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించిన కేటీఆర్.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


ముస్లిం మైనార్టీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనార్టీల ప్రత్యేక హోదా పోతుందని అన్నారు కేటీఆర్. మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ డిక్లరేషన్‌ లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ఐడియాలజీతో పనిచేసిందని చెప్పారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. తప్పుడు వాగ్దానాలు కాంగ్రెస్ కి కొత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసిందని, ఈసారి కూడా ఎన్నికల ముందు మైనార్టీలకు గేలమేసేందుకు డిక్లరేషన్ విడుదల చేసిందని ఎద్దేవా చేశారు కేటీఆర్.

2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీల కోసం ఏం చేసిందని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం కేవలం రూ.930 కోట్లు ఇస్తే.. గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు రాజ్యాంగపరంగా మతపరమైన మైనార్టీలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కై ఆటలాడుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ ముఖ్య నేతల సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ వీక్‌ క్యాండిడేట్స్‌ ను నిలబెట్టిందని విమర్శించారు.

First Published:  10 Nov 2023 6:24 PM IST
Next Story