పదేళ్లు నిద్రపోయారా మోదీజీ..! పాత వీడియోతో సెటైర్లు పేల్చిన కేటీఆర్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా చుట్టినట్టుగానే, తెలంగాణ ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా చుట్టడం గ్యారెంటీ అంటున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి వచ్చే సీట్లు సున్నా అన్నారు.
ప్రధాని మోదీ నేడు పాలమూరు వస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు ఆర్భాటంగా ప్రకటించారు కూడా. అయితే పాలమూరు జిల్లాకు ఇచ్చిన హామీని మాత్రం ఆయన మరిచారు. పాలమూరు ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ప్రకటించే విషయంలో మోదీ తెలంగాణ ప్రజలకు హ్యాండిచ్చారు. అయితే ఇదే మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారో తెలుసా..? ఓసారి చూడండి అంటూ మంత్రి కేటీఆర్ అప్పటి వీడియో షేర్ చేశారు. మోదీ అబద్ధాలు ఎలా ఉంటాయో మరోసారి బయటపెట్టారు.
PM @narendramodi Ji,
— KTR (@KTRBRS) October 1, 2023
Back in 2014, you had questioned the UPA Govt about their indifferent attitude towards Palamuru irrigation projects and asked if they were sleeping for 10 years!
Today, after seeing 10 years of BJP's apathy towards Mahbubnagar, I want to show the mirror to… pic.twitter.com/IBPrHaIU3m
2014 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు నీటిపారుదల ప్రాజెక్ట్ విషయంలోయూపీఏ ప్రభుత్వం పదేళ్లుగా నిద్రపోయిందా అని మండిపడ్డారు. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత యూపీఏ స్థానంలో ఎన్డీఏ వచ్చింది. మోదీ పాలనలో పదేళ్లు గడిచిపోయాయి. మరి ఈ పదేళ్లలో మోదీ సర్కారు కూడా నిద్రపోయిందేమో, అందుకే పాలమూరు ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదు. అద్దంలో మిమ్మల్ని మీరే చూసుకున్నట్టుగా ఉందా మోదీజీ అంటూ ఆ వీడియో షేర్ చేస్తూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్.
జీరో..
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా చుట్టినట్టుగానే, తెలంగాణ ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా చుట్టడం గ్యారెంటీ అంటున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో బీజేపీకి వచ్చే సీట్లు సున్నా అన్నారు. ప్రధాని మోదీ పాలమూరు పర్యటన సందర్భంగా తెలంగాణ వాదులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకుని తిరిగి పాలమూరు గడ్డపై మోదీ అడుగు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.