Telugu Global
Telangana

ఐటీలో బెంగళూరును కొట్టింది హైదరాబాదే - కేటీఆర్‌

గతేడాది నాస్కామ్ రిపోర్టు ప్రకారం.. 4.50 లక్షల ఉద్యోగాలు కొత్తగా దేశంలో వస్తే అందులో 1.50 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయ‌ని, బెంగళూరులో 1.46 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు వచ్చాయన్నారు.

ఐటీలో బెంగళూరును కొట్టింది హైదరాబాదే - కేటీఆర్‌
X

ఐటీ ఉద్యోగాల‌ కల్పనలో బెంగళూరును అధిగమించింది హైదరాబాద్‌ మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఏ నగరం కూడా ఇప్పటివరకూ ఈ ఘనత సాధించలేదన్నారు. వరుసగా గత రెండేళ్లుగా ఉద్యోగ కల్పనలో బెంగళూరును హైదరాబాద్‌ అధిగమించిందన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన కేటీఆర్.. ఈ కామెంట్స్ చేశారు.

గతేడాది నాస్కామ్ రిపోర్టు ప్రకారం.. 4.50 లక్షల ఉద్యోగాలు కొత్తగా దేశంలో వస్తే అందులో 1.50 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు హైదరాబాద్‌లో వచ్చాయ‌ని, బెంగళూరులో 1.46 ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం పరిస్థితి ఇంకా మెరుగైందన్నారు. ఈ ఏడాది దేశంలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణమన్నారు మంత్రి కేటీఆర్‌.


ఇక తెలంగాణ వచ్చాక భూముల విలువ భారీగా పెరిగిందన్నారు. నీటి సౌకర్యం, పెట్టుబడి సాయం కారణంగా రాష్ట్రంలో రైతులు ధీమాతో ఉన్నారని చెప్పారు. భూముల విలువ కేవలం హైదరాబాద్‌, దాని శివారు ప్రాంతాల్లో మాత్రమే పెరగలేదని, రాష్ట్రమంతటా ల్యాండ్ వాల్యూ విప‌రీతంగా పెరిగిందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో అసాధారణమైన విజయాలు సాధించామన్నారు కేటీఆర్‌. స్థిరమైన ప్రభుత్వం, ధృడమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ట్రెండ్‌ కొనసాగాలంటే కేసీఆర్‌ను మరోసారి గెలిపించాలన్నారు.

First Published:  14 Nov 2023 7:37 AM GMT
Next Story