రూపాయి విలువ పతనం... బీజేపీపై మంత్రి కేటీఆర్ సెటైర్
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతూ ఉంటే నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల్లో మోడీ ఫోటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారని ట్వీట్ చేశారు కేటీఆర్.
డాలర్ తో రూపాయి మారకం విలువ నిన్న అత్యంత కనిష్టానికి పడిపోయింది. దీనిపై ఆర్థిక వేత్తలు, రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఈ అంశంపై స్పందన కూడా కరువైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు.
ఒక వైపు రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోతుంటే మరో వైపు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపుల్లో మోడీ ఫోటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారని ట్వీట్ చేశారు కేటీఆర్.
పైగా దేశంలో ఆర్థిక ఇబ్బందులకు, నిరుద్యోగం, ద్రవోల్బణం సహా అన్ని అవరోదాలకు దేవుడే (గాడ్ ఆఫ్ యాక్ట్సే) కారణమని చెప్తుంటారు. విశ్వగురుకు నమస్కారం... ఇక ఆయనను పొగడడం మొదలుపెట్టండి అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్ పై నెటిజనులు ఆయనకు మద్దతుగా స్పందిస్తున్నారు. ''మోడీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 2013 లో డాలర్ తో రూపాయి మారకం విలువ 60 రూపాయలున్నప్పుడు మోడి తీవ్రంగా విమర్శించారు. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని మోడీ ఆరోపించారు. ఇక ఇప్పుడు రూపాయి విలువ 81కి పెరిగితే అది సహజ పరిణామమని వాదిస్తున్నారు.''అని నెటిజనులు విమర్శిస్తున్నారు.