Telugu Global
Telangana

రాహుల్‌గాంధీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ నిరుద్యోగి- కేటీఆర్

కర్ణాటక యువతను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందన్నారు కేటీఆర్." ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటి కేబినెట్‌లోనే సంతకం పెడుతాం అని మాయమాటలు చెప్పారు.

రాహుల్‌గాంధీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ నిరుద్యోగి- కేటీఆర్
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి నాలుగు ప్రశ్నలు సంధించారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. దమ్ముంటే ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉందేమో చూపించాలి?

ఉద్యోగా నియామకాలపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ నోటికొచ్చినట్లు వాగుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్." దేశంలోనే అత్యధికంగా లక్షా 63వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడే ప్రింట్ పంపిస్తున్నా రాహుల్ గాంధీని చదువుకోమనండి. చదువు రాకపోతే పక్కన ఎవరైనా ఉంటే చదివించుకోమనండి" అని కేటీఆర్ అన్నారు.

2. కర్ణాటకలో నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేసింది నిజం కాదా?

కర్ణాటక యువతను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందన్నారు కేటీఆర్." ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మొదటి కేబినెట్‌లోనే సంతకం పెడుతాం అని మాయమాటలు చెప్పారు. ఆరు నెలలు దాటినా ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు". ఇచ్చిన మాట తప్పి నిరుద్యోగుల్ని మోసం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

3. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డివి పరీక్ష రాసి, ఉద్యోగం చేసిన ముఖాలా?

ఇవాళ నిరుద్యోగ సమస్యపై గొంతు చించుకుంటున్న రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి.. ఏరోజైనా పరీక్ష రాసి ఉద్యోగం చేసిన ముఖాలా అని ఫైర్ అయ్యారు కేటీఆర్. నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడే అర్హత మీకుందా అని ప్రశ్నించారు. BRS ప్రభుత్వం మీకంటే 16రెట్లు ఎక్కువ ఉద్యోగాలిచ్చిందన్నారు కేటీఆర్.

4. జ్యాబ్ క్యాలెండర్‌తో ఎవరిని ఏప్రిల్‌ ఫుల్ చేద్దామనుకుంటున్నారు?

ఏప్రిల్‌ 1ని రాహుల్‌ గాంధీ పేరుమీద పప్పు దివాస్‌గా జరపాలన్నారు కేటీఆర్. దేశంలో అతిపెద్ద పొలిటికల్ నిరుద్యోగి రాహుల్ గాంధీ అని కౌంటరిచ్చారు. జాబుల్లేని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి యువత మోసపోవొద్దన్నారు. డిసెంబర్‌ 4 తర్వాత అశోక్‌ నగర్‌కు వెళ్లి నిరుద్యోగులతో కూర్చొని జాబ్ క్యాలెండర్ తయారు చేస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.

First Published:  26 Nov 2023 1:34 PM IST
Next Story