వార్డు కార్యాలయాలతో పౌర సేవలు మరింత చేరువ..
సిటీజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందుతాయని కేటీఆర్ చెప్పారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందని, ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలోని అన్ని చోట్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చి నేర్చుకుని వెళ్లే పరిస్థితి ఉంటుందని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పౌర సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు `పురపాలన`లో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజలు కేంద్రంగా పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటుచేస్తున్న వార్డు కార్యాలయాల్లో 10 మందితో కూడిన అధికారుల బృందం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఇకపై వార్డు కార్యాలయాల్లో కనీస పౌర సేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయని వివరించారు.
సిటీజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందుతాయని కేటీఆర్ చెప్పారు. దేశం మొత్తం మనవైపు చూస్తోందని, ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలోని అన్ని చోట్ల నుంచి హైదరాబాద్‌కు వచ్చి నేర్చుకుని వెళ్లే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదులు అందించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచీ వాటిని స్వీకరించాలని, తరతమ భేదాలు చూడొద్దని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.