రేవంత్ రెడ్డీ..! కరెంటు తీగలు గట్టిగా పట్టుకో
కేసీఆర్ కామారెడ్డి వస్తున్నారని, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా ఆయన ఇక్కడకు వస్తున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇక కామారెడ్డిలో ఏ పనీ కాకుండా పోదన్నారు.
24 గంటలు కరెంట్ ఎక్కడిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రశ్నిస్తున్నారని.. అదేమన్నా మనిషా, కనపడటానికి అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి, కామారెడ్డికి వచ్చి కరెంటు తీగలు పట్టుకోవాలని.. ఉందో లేదో తెలిసొస్తుందని సెటైర్లు పేల్చారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పెద్ద మల్లారెడ్డిలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తిరిగి అధికారంలోకి వచ్చాక మరిన్ని పథకాలు ప్రవేశ పెడతామన్నారు.
Live: ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గం, పెద్ద మల్లారెడ్డిలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్.
— BRS Party (@BRSparty) November 18, 2023
#VoteForCar #KCROnceAgain https://t.co/dRuXxYsUw9
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..
కేసీఆర్ కామారెడ్డి వస్తున్నారని, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా ఆయన ఇక్కడకు వస్తున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇక కామారెడ్డిలో ఏ పనీ కాకుండా పోదన్నారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి మీరు ఊహించని స్థాయిలో జరుగుతుందన్నారు. రైతు బంధు వృథా అని, ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. అలాంటి వారికి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒక్క ఛాన్స్ ఇస్తే కాంగ్రెస్ వాళ్లు రైతుల్ని చావగొడతారని, పట్వారీ వ్యవస్థ తెస్తారని చెప్పారు.
ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకోకూడదని.. ధరణిలో లోటుపాట్లు ఉంటే అసలు ధరణినే తీసేయాలనడం సరికాదన్నారు కేటీఆర్. మూడోసారి అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మనోడు మనోడే, మంది వాడు మందివాడే అని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని కామారెడ్డిలో గెలిపిస్తారా.. లేక ఢిల్లీ వాళ్లు నిలబెట్టిన వారిని గెలిపిస్తారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు కామారెడ్డి వరకు వస్తాయని హామీ ఇచ్చారు కేటీఆర్.