Telugu Global
Telangana

నేతన్నల కోసం మెరుగైన ప్రణాళిక -కేటీఆర్

నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా వంటి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ సొసైటీల పనితీరు మరింత మెరుగుపరచాలని చెప్పారు.

నేతన్నల కోసం మెరుగైన ప్రణాళిక -కేటీఆర్
X

నేతన్నల నేస్తంగా చేనేత కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆయా పథకాల అమలు తీరుపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మరింత మెరుగైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలన్నారు.

నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. చేనేత మిత్ర పథకాన్ని మరింత సరళీకరించాలని చెప్పారు. టెక్స్ టైల్ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు మరింతగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరింతగా ఆయా వర్గాల్లోకి తీసుకుపోయేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలను వారోత్సవాల్లో నిర్వహించాలన్నారు. చేనేత ఉత్పత్తుల పట్ల ఆసక్తిని పెంచేలా పలు సంస్థలు, వ్యక్తులు, ప్రజా ప్రతినిధులను ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పారు కేటీఆర్.


నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా వంటి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు కేటీఆర్. రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ సొసైటీల పనితీరు మరింత మెరుగుపరచాలని చెప్పారు. సొసైటీలోని సభ్యుల స్థితిగతులు మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి అవసరమైన నిధుల సమీకరణపై కూడా అధికారులతో చర్చించారు కేటీఆర్.

హైదరాబాద్ శిల్పారామంలో జౌళి శాఖ తరపున మ్యూజియం ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. ఆర్టీసీ, రైల్వే శాఖలను సంప్రదించి చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కు అవసరమైన సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో నేతన్నలకోసం అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసే వ్యూహాలను అమలు చేయాలన్నారు.

First Published:  12 July 2023 6:42 AM IST
Next Story