Telugu Global
Telangana

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్. మిగిలిన ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్ష
X

హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. GHMC పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగకుండా పంపిణీ జరగాలన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లక్ష ఇళ్లు..

హైదరాబాద్ పరిధిలో లక్ష మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలనేది కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన. దీనికి తగ్గట్టే నిర్మాణాలు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఎప్పటినుంచి పంపిణీ జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. తాజాగా సీఎం కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తీపి కబురు చెప్పారు. గోల్కొండలో జెండా ఎగురవేసిన ఆయన.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

ప్రభుత్వం నిర్మించి ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలనుకునేవారికి అన్ని అర్హతలు పరిశీలించి పూర్తి ఉచితంగా వాటిని అందజేస్తారు. సొంత స్థలం ఉండి, అందులో ఇల్లు కట్టుకోడానికి ప్రభుత్వ సాయం కావాలనుకున్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తారు. తెలంగాణలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

First Published:  16 Aug 2023 8:44 AM GMT
Next Story