కర్నాటక రైతులకు బీఆర్ఎస్ డబ్బులిచ్చిందా..? కేటీఆర్ ఏమన్నారంటే..?
మేడిగడ్డ బ్యారేజ్ కట్టి పదేళ్లు పూర్తయిందని.. ప్రజలకు సంబంధించి ఒక్కపైసా కూడా వృథా చేయబోమన్నారు కేటీఆర్. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని బ్యారేజ్ నిలబడిందని, ఇటీవలే బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించిందని.. ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు సరికాదన్నారు.
ఇటీవల కర్నాటక రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన వీడియోలు వైరల్ గా మారాయి. అసలు కర్నాటక రైతులకు తెలంగాణలో పనేంటి..? ఇక్కడికొచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నారు..? పైగా కాంగ్రెస్ కి ఓటు వేయొద్దంటూ తెలంగాణ రైతులకు ఉచిత సలహాలు ఎందుకిస్తున్నారంటూ కొంతమంది వెటకారమాడారు. బీఆర్ఎస్ డబ్బులిచ్చి మరీ వారిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అలాంటి పని చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. పోనీ కర్నాటక వెళ్లి అక్కడి రైతుల పరిస్థితి ఆరా తీద్దామా అని ప్రశ్నించారు కేటీఆర్. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన.. పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
Live: BRS Working President, Minister Sri @KTRBRS speaking at 'Meet the Press' program in Hyderabad.#KCROnceAgain#VoteForCar https://t.co/vK08Ku6PCo
— BRS Party (@BRSparty) October 28, 2023
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. రుణాలు తెచ్చిన మాట వాస్తవమేనని అయితే.. ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని వివరించారు. సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వాటిని వినియోగించామన్నారు. సంపద సృష్టించడం కోసం రుణాలు తీసుకువచ్చామన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని.. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్.
గతంలో మైగ్రేషన్.. ఇప్పుడు ఇరిగేషన్
మైగ్రేషన్ కు పర్యాయపదంగా ఉండే పాలమూరు, ఇప్పుడు ఇరిగేషన్ కు పర్యాయపదంగా మారిందని ఇదంతా కేసీఆర్ ఘనతేనన్నారు కేటీఆర్. ఐటీ, ఫార్మా, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని.. నీళ్లు, నిధులు, నియామకాలకు సంపూర్ణ న్యాయం చేశామని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ కట్టి పదేళ్లు పూర్తయిందని.. ప్రజలకు సంబంధించి ఒక్కపైసా కూడా వృథా చేయబోమన్నారు కేటీఆర్. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని బ్యారేజ్ నిలబడిందని, ఇటీవలే బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించిందని.. ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు సరికాదన్నారు.