Telugu Global
Telangana

హైదరాబాద్ పార్కింగ్ సమస్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్..

కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెట్రో రూట్లలో పార్కింగ్ సమస్య లేకుండా చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. పార్క్ అండ్ రైడ్ అనే విధానాన్ని తెరపైకి తెస్తున్నామన్నారు.

హైదరాబాద్ పార్కింగ్ సమస్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్..
X

హైదరాబాద్ లో పార్కింగ్ సమస్య గురించి ఓ సాధారణ పౌరుడు చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. పార్కింగ్ ఏరియాల విషయంలో ప్రత్యామ్నాయాలకోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. మల్టీ లెవల్ పార్కింగ్(MLP) మోడల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి MLPలు చాలా అవసరం అని అన్నారు కేటీఆర్.


హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య ఉందని ఆ సమస్యకు పరిష్కారంగా దీన్ని పరిశీలించండి అంటూ బిపిన్ సక్సేనా అనే వ్యక్తి ఓ వీడియోని ట్వీట్ చేశారు. మిషన్ల సాయంతో కార్లను పార్కింగ్ చేసి, తిరిగి వాటిని కిందకు తీసుకు వచ్చే వీడియో అది. ఓ పెద్ద బిల్డింగ్ ని నిర్మించి అందులో కార్లను మిషన్ల సాయంతో పార్కింగ్ చేయడం, డ్రైవర్ల సాయం లేకుండానే తిరిగి వాటిని కిందకు తీసుకు రావడం ఇందులో స్పెషాలిటీ. తక్కువ స్థలంలో ఎక్కువ కార్లను ఇలా పార్కింగ్ చేయొచ్చు. ఇలాంటి వాటిని హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేస్తే పార్కింగ్ సమస్యను పరిష్కరించొచ్చు అంటూ సలహా ఇచ్చారు బిపిన్ సక్సేనా. ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెట్రో రూట్లలో పార్కింగ్ సమస్య లేకుండా చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. పార్క్ అండ్ రైడ్ అనే విధానాన్ని తెరపైకి తెస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలిస్తున్నామని, వాటి యజమానులతో మాట్లాడి పార్కింగ్ ఏరియాస్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన టీమ్ మరిన్ని కొత్త ఐడియాలను పరిశీలిస్తోందన్నారు. సదరు వ్యక్తి ఇచ్చిన ఇన్ పుట్స్ ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు మంత్రి కేటీఆర్.

First Published:  1 Aug 2023 7:03 AM GMT
Next Story