Telugu Global
Telangana

హౌసింగ్ సొసైటీల్లో లేకపోయినా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు

వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ ను టీయూడబ్ల్యూజే 143 నేతలు కలిశారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వారు మంత్రి కేటీఆర్ కి వినతిపత్రం అందించారు.

హౌసింగ్ సొసైటీల్లో లేకపోయినా జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు
X

హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వం లేని జర్నలిస్ట్ ల వివరాలు సేకరించి వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. వరంగల్ లో తనను కలసిన జర్నలిస్ట్ లకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌ ను టీయూడబ్ల్యూజే 143 నేతలు కలిశారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వారు మంత్రి కేటీఆర్ కి వినతిపత్రం అందించారు. జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ భూములు ఎక్కడ కేటాయించారో తెలియజేసి, భూమి ధర చెల్లింపు కోసం ఖాతా నంబరు వెంటనే ఇవ్వాలని అధికారులకు సూచించారు కేటీఆర్. హౌసింగ్ సొసైటీల్లో లేని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

రెండు హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులు కాకుండా మిగిలిన జర్నలిస్ట్ ల జాబితా రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు మంత్రి కేటీఆర్ సూచించారు. జాబితా ఫైనల్ అయితే వారికి కూడా ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని కలెక్టర్ల‌కు ఆదేశాలిచ్చారు. జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు మంత్రి కేటీఆర్.

First Published:  17 Jun 2023 7:14 PM IST
Next Story