Telugu Global
Telangana

డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్.. కేటీఆర్ ఏమన్నారంటే..?

డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ పొలం కూడా దున్నుతుంది. ఈ వీడియోని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్.. కేటీఆర్ ఏమన్నారంటే..?
X

సరైన ప్రోత్సాహం అందించాలే కానీ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయొచ్చు. సరైన దశ, దిశ నిర్దేశం చేసి, ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టించగల యువత మనకు అందుబాటులో ఉంది. అలాంటి అద్భుతాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మంత్రి కేటీఆర్. డ్రైవర్ లేకుండానే నడిచే ట్రాక్టర్ ని సిద్ధం చేసిన కాకతీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్ (KITS) బృందాన్ని అభినందించారు.

డ్రైవర్ లెస్ ట్రాక్టర్..

ఎక్కడో విదేశాల్లో డ్రైవర్ లేకుండానే కార్లు నడిపే అధునాతన టెక్నాలజీ వచ్చిందంటే విని మనం ఆశ్చర్యపోతుంటాం. ఆ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వచ్చినా దానివల్ల ఇబ్బందులేమైనా ఉంటాయో లేదో తెలియదు. అయితే వరంగల్ లోని KITS బృందం మాత్రం అలాంటి అద్భుతాన్ని సృష్టించింది. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ ని నడిపింది. అంతే కాదు. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ పొలం కూడా దున్నుతుంది. ఈ వీడియోని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.


మన వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఇదేనని చెప్పారు మంత్రి కేటీఆర్. యువ ఆవిష్కర్తలు తమ ప్రతిభకు పదును పెడితే సామాజిక ప్రభావం చూపగలరని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి ఇలాంటి వినూత్న ఆలోచనలు సరికొత్త ఉత్పత్తులు మరిన్ని బయటకు రావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక మేలుకోసం మరిన్ని ఆవిష్కరణలు చేయండి అంటూ వారికి సూచించారు. టి హబ్, టి వర్క్స్, వుయ్ హబ్, రిచ్, టీమ్ TSIC వంటి సంస్థలు యువ ఆవిష్కర్తలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు కేటీఆర్.

First Published:  17 May 2023 1:07 PM IST
Next Story