తెలంగాణ అభివృద్ధికి ఇంతకంటే సాక్ష్యం కావాలా –కేటీఆర్
ఫిక్కీ (FICCI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్లో హైదరాబాద్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు.
అభివృద్ధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. ఫిక్కీ (FICCI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్లో హైదరాబాద్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళలకు అవార్డులు అందజేశారు. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Industries Minister @KTRTRS participated in @FloHydBizAwards ceremony and presented awards to successful women-led businesses representing various industry sectors based in Telangana.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 11, 2023
Minister assured the women entrepreneurs of the complete support from Telangana Govt. pic.twitter.com/TJss0Izht0
భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల, బయోలాజికల్-ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల సమర్థవంతంగా తమ కంపెనీలను నడిపిస్తున్నారని ప్రశంసించారు కేటీఆర్. ఆ రెండు కంపెనీల అతి పెద్ద కేంద్రాలు హైదరాబాద్ లోనే ఉన్నాయని చెప్పారు. ఆయా రంగాల్లో ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు జరగాలని, మహిళలు మరింత ముందుకు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇంతకంటే ఉదాహరణలు కావాలా..?
తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ. 1.24 లక్షలు ఉంటే ఇప్పుడది రూ.2.78 లక్షలకు పెరిగిందని, ఇది దేశ సగటుకంటే ఎక్కువని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2014లో రూ.57వేల కోట్లు ఉంటే ఇప్పుడవి రూ.1.83లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో కూడా తెలంగాణ మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 10వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని, చేపలు, మాంసం, డైరీ ప్రొడక్ట్స్ భారీగా ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ ఆదర్శం..
భారత్ లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. నూతన ఆవిష్కరణలకు మిగిలిన దేశాల్లోని నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందన్నారు. దేశానికే కాదు అంతర్జాతీయ వ్యాక్సిన్ కేంద్రంగా హైదరాబాద్ హబ్ గా తయారైందన్నారు.