ఏరో స్పేస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్
FDI ర్యాంకింగ్స్- 2020 ప్రకారం కాస్ట్ ఎఫెక్టివ్ పారామీటర్ లో ఫ్యూచర్ నంబర్ 1 ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి ఈ అవార్డులు మరింత గుర్తింపు తెచ్చాయన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వాషింగ్టన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం విశేషం. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఏరోస్పేస్ సేవలు, తెలంగాణలో ఏరోస్పేస్ కంపెనీల పెట్టుబడులు, అభివృద్ధిపై ఆయన అమెరికా సంస్థల ప్రతినిధులకు వివరించారు. అక్కడి థింక్ ట్యాంక్ లు, స్టార్టప్ ల భాగస్వామ్యాన్ని కోరారు. ఈ చర్చలో అమెరికాకు చెందిన పలు ఏరోస్పేస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
IT and Industries Minister @KTRBRS led the Aerospace and Defense Roundtable in Washington DC. The event garnered participation from prominent US majors, advisory firms, think tanks, and startups, creating a dynamic platform for discussion and collaboration.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023
At the roundtable,… pic.twitter.com/ey705UHBqv
గత తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధిని రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించారు మంత్రి కేటీఆర్. US ఏరోస్పేస్, డిఫెన్స్ కార్పొరేషన్ ల పెట్టుబడి గమ్యస్థానం హైదరాబాద్ అని వివరించారు. 2018, 2020, 2022లో మూడు సంవత్సరాల పాటు ఏరోస్పేస్ రంగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ.. పలు అవార్డులు గెలుచుకుందని చెప్పారు మంత్రి కేటీఆర్. FDI ర్యాంకింగ్స్- 2020 ప్రకారం కాస్ట్ ఎఫెక్టివ్ పారామీటర్ లో ఫ్యూచర్ నంబర్ 1 ఏరోస్పేస్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని చెప్పారు. తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి ఈ అవార్డులు మరింత గుర్తింపు తెచ్చాయన్నారు.
తెలంగాణలో నూతన పరిశ్రమల అనుమతికి TS IPASS ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో వివరించారు మంత్రి కేటీఆర్. విప్లవాత్మక పారిశ్రామిక విధానాన్ని తాము రూపొందించామని, సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ఆన్ లైన్ లోనే అనుమతులు మంజూరు చేస్తూ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.