Telugu Global
Telangana

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కేటీఆర్ పెళ్లి ఫొటోలు.. ఎందుకో తెలుసా?

ఐటీ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతుల వివాహ వార్షికోత్సం నిన్న జరిగింది. 2003లో వీరిద్దరి వివాహం డిసెంబర్ 18నే జరిగింది.

KTR Wedding Anniversary Photos
X

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కేటీఆర్ పెళ్లి ఫొటోలు.. ఎందుకో తెలుసా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటే యువతలో చాలా క్రేజ్. సోషల్ మీడియాలో ఆయన యాక్టీవ్‌గా ఉంటూ.. నిత్యం అందరినీ ఉత్సాహపరుస్తుంటారు. మోడీ ప్రభుత్వ విఫల పాలన, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియాలో గళమెత్తుతుంటారు.

సాధారణంగా కేటీఆర్ తన పర్సనల్ విషయాలను ఎక్కువగా సోషల్ మీడియాలో పంచుకోరు. ఎప్పుడో ఒక సారి అడపాదడపా కుటుంబం, వ్యక్తిగత విషయాలను గుర్తు చేసుకుంటుంటారు. కానీ నిన్నటి నుంచి అనూహ్యంగా కేటీఆర్ పెళ్లినాటి ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్‌గా మారాయి. చాలా మంది 19 ఏళ్ల క్రితం నాటి ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. నిన్న కేటీఆర్ పెళ్లి రోజు కావడమే.

ఐటీ మంత్రి కేటీఆర్-శైలిమ దంపతుల వివాహ వార్షికోత్సం నిన్న జరిగింది. 2003లో వీరిద్దరి వివాహం డిసెంబర్ 18నే జరిగింది. ఆ దంపతులు 20వ వసంతంలోకి అడుగు పెట్టడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

నిన్నటి నుంచి కేటీఆర్ పెళ్లి ఫొటోలు ట్విట్టర్ వేదికగా వెల్లువెత్తుతున్నాయి. కాగా, కేటీఆర్ మాత్రం తన పెళ్లి రోజుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించలేదు. ఎప్పటి లాగానే తన పర్సనల్ విషయాన్ని దూరంగానే ఉంచారు. కానీ.. నిన్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌ను చూస్తూ ట్వీట్లు చేశారు. అర్జెంటీనా జట్టుకు, మెస్సీకి అభినందనలు తెలిపారు.

ఇక కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో దూరంగానే ఉంటారు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తారు తప్ప.. ఇతర విషయాల్లో ఆమె జోక్యం ఎక్కువగా ఉండదు. తన భార్యకు చాలా ఓపిక అని.. తన సహకారంతోనే తాను మంత్రిగా ప్రశాంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అప్పుడప్పుడు చెబుతారు. కేటీఆర్, శైలిమ దంపతులకు కొడుకు హిమాన్షు, కూతురు అలేఖ్య ఉన్నారు.





First Published:  19 Dec 2022 4:37 PM IST
Next Story