Telugu Global
Telangana

దేశంలో మూడోవంతు ఉద్యోగాలు హైదరాబాద్ లోనే..

సెమీకండ‌క్ట‌ర్ రంగంలో భార‌త్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంద‌న్నారు మంత్రి కేటీఆర్. రాబోయే ద‌శాబ్ధంలో ఈ రంగంలో భార‌త్ దూసుకెళ్తుంద‌ని చెప్పారు.

దేశంలో మూడోవంతు ఉద్యోగాలు హైదరాబాద్ లోనే..
X

దేశంలో మూడోవంతు ఉద్యోగాలు హైదరాబాద్ లోనే..

నాస్కామ్‌ లెక్కల ప్రకారం ఐటీ రంగంలో దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌ నుంచే ఉన్నాయని అన్నారు మంత్రి కేటీఆర్. బెంగళూరు, చెన్నై కంటే ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్‌ ముందంజలో ఉందని చెప్పారు. దేశానికి లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌ గా హైదరాబాద్ పేరు తెచ్చుకుందని, భారత్‌ లో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి జీనోమ్‌ వ్యాలీ హెడ్‌ క్వార్టర్ గా మారిందన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ అని చెప్పారు. హైదరాబాద్ లోని కోకాపేటలో మైక్రోచిప్‌ టెక్నాలజీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ కండక్టర్‌ డిజైన్‌, డెవలప్‌ మెంట్‌ సెంటర్ ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని చెప్పారాయన.


మైక్రోచిప్ టెక్నాలజీ సంస్థ ఆరిజోనాలోని చాండ్లర్ కేంద్రంగా పనిచేస్తోంది. పారిశ్రామిక రంగం, ఆటోమోటివ్, కన్స్యూమర్ ప్రోడక్ట్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటింగ్ రంగాలలో 1,25,000 కంటే ఎక్కువ మంది కస్టమర్‌ లకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ లో తమ డిజైన్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది.

సెమీకండ‌క్ట‌ర్ రంగంలో భార‌త్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంద‌న్నారు మంత్రి కేటీఆర్. రాబోయే ద‌శాబ్ధంలో ఈ రంగంలో భార‌త్ దూసుకెళ్తుంద‌ని చెప్పారు. ఈ ప్ర‌క్రియ‌లో హైద‌రాబాద్ న‌గ‌రం కీల‌క పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వెయ్యి మందికి సొంత ఖ‌ర్చుల‌తో శిక్ష‌ణ ఇస్తోంద‌న్నారు. ఎల‌క్ట్రానిక్స్, సిస్ట‌మ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ స్కిలింగ్ రంగంలో తెలంగాణ అగ్ర‌గామిగా కొన‌సాగుతోంద‌న్నారు మంత్రి కేటీఆర్.

First Published:  3 July 2023 12:53 PM IST
Next Story