Telugu Global
Telangana

ద్వేషం, హింసకు హైదరాబాద్ లో చోటు లేదు

హైదరాబాద్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనం అని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నామని అన్నారు.

ద్వేషం, హింసకు హైదరాబాద్ లో చోటు లేదు
X

హైదరాబాద్ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుందని, అర్ధంలేని మాటల‌కు, ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో చట్టాల అతిక్రమణ సాధ్యం కాదన్నారు. అకడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు పగడ్బందీగా ఉన్నాయ‌ని చెప్పారు. హైద‌రాబాద్ నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌ మెంట్ అసెట్స్ సర్వీస్ (CITCO) కొత్త యూనిట్‌ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

హైదరాబాద్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనం అని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నామని అన్నారు. గత తొమ్మిదేళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం.. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. హైదరాబాద్‌ ను ఎంపిక చేసుకుని CITCO తెలివైన అడుగు వేసిందన్నారు.


అమెజాన్ అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఉందని, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, ఉబెర్, మైక్రోన్, క్వాల్‌ కామ్ వంటి సంస్థలకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌ కు హైదరాబాద్ వేదిక అని అన్నారు. CITCOకు చెందిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌ లో ఉండాలని, దానిని సాకారం చేద్దామని చెప్పారు.

First Published:  18 April 2023 11:36 AM GMT
Next Story