కేటీఆర్ ని మెప్పించిన ముఖరా.కె ఎందుకో తెలుసా..?
జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అయిన ముఖరా.కె ఇప్పుడు తెలంగాణ విజయాలను అద్భుతంగా చాటి చెబుతోంది, అందరికీ ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ప్రత్యే లోగో కూడా ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అమరుల త్యాగాలు స్మరించుకుంటూ, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్దిని దశదిశలా చాటేలా ఉత్సవాలకు రూపకల్పన చేశారు. జూన్-2నుంచి 21రోజులపాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
అంతా బాగానే ఉంది. ఉత్సవాలు ఘనంగా చేయడమంటే ఏంటి..? తెలంగాణ సాధించిన అభివృద్ధిని అందరికీ తెలియజేయడం ఎలా, తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ప్రచారం చేసుకోవడం ఎలా..?
ఇదిగో ఇలా. అవును సరిగ్గా ఇలాగే. తెలంగాణ అభివృద్ధి గురించి ముఖరా.కె గ్రామం ఇలా ప్రచారం చేస్తోంది. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడెలా ఉన్నాం, తేడా ఏంటి అనే విషయాలను బ్యానర్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు ముఖరా.కె గ్రామ సర్పంచ్. గ్రామంలో ఆకట్టుకునే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఆసక్తిగా గ్రామస్తులు తిలకిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం అదిరిపోతోంది. అందుకే మంత్రి కేటీఆర్ కూడా ఆ ప్రచారానికి తన తరపున మరింత ప్రచారం కల్పించారు. ముఖరా.కె లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రీట్వీట్ చేశారు.
సర్పంచ్ లు ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట పడి పని చేయించుకునుడే కాదు చేసిన పనులను ఇట్లా ప్రచారం కూడా చేయాలి. ఆనాడు మన పరిస్తితి ఏంది, ఇప్పుడు మన ప్రభుత్వం వొచ్చక పరిస్తితి ఏంది అనేది ప్రజలకు తెలిసేలా చేయాలి.
— (@Nallabalu1) May 22, 2023
ఈ ముఖరా గ్రామ సర్పంచ్ ఎవరో కానీ ఈ సర్పంచ్ ను అందరూ సర్పంచులు అనుసరించాలి. pic.twitter.com/Dklva71ZDm
తెలంగాణలోని ముఖరా.కె గ్రామం ఇప్పటికే దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. తెలంగాణలోనే మొదటి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామం ఇది. గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది. గ్రామస్తులంతా కలసి సామాజిక వనాలు పెంచుతున్నారు. గ్రామంలో వందశాతం డిజిటల్ లిటరసీ ఉంది. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అయిన ముఖరా.కె ఇప్పుడు తెలంగాణ విజయాలను అద్భుతంగా చాటి చెబుతోంది, అందరికీ ఆదర్శంగా నిలిచింది.