కేటీఆర్ మానవత్వం.. ఆ యువకుడు సేఫ్
సదరు యువకుడిని ఆస్పత్రిలో చేర్పించామని అతడు కోలుకున్నాడని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు.
మంత్రి కేటీఆర్ మానవత్వంతో సకాలంలో స్పందించారు. ఆంబులెన్స్ రావడం ఆలస్యం అయ్యే అవకాశముండటంతో రోడ్డు ప్రమాద బాధితుడిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అతడిని ఆస్పత్రికి చేర్చడంతో.. ప్రమాదం లేదని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
అసలేం జరిగింది..?
మంత్రి కేటీఆర్ జగిత్యాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై అప్పుడే ఓ ప్రమాదం జరిగింది. ఓ యువకుడు రక్త గాయాలతో స్పృహకోల్పోయాడు. అంబులెన్స్ కి ఫోన్ చేసినా ఇంకా రాలేదు. ఈలోపు బాధితుడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన కాన్వాయ్ లోని వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రమాద స్థలానికి రావడం, యువకుడి పరిస్థితి ఆరా తీయడం, వాహనంలో అతడిని తరలించడం.. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి కేటీఆర్ ఔదార్యాన్ని నెటిజన్లు అభినందించారు. గతంలో కూడా ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్ ఆపి మరీ వారిని పరామర్శించారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు సాయపడ్డారు.
మానవత్వం చాటుకున్న మంత్రి వర్యులు శ్రీ @KTRBRS గారు..!!
— Pochampally Srinivas Reddy (@PSReddyTRS) July 16, 2023
ఈరోజు జగిత్యాల పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం లో గాయపడిన వారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు...@KTRBRS #ktr… pic.twitter.com/GTscFrEVrz
సదరు యువకుడిని ఆస్పత్రిలో చేర్పించామని అతడు కోలుకున్నాడని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. బాధితుడి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు. సకాలంలో స్పందించి బాధితుడుకి తన కారు ఇచ్చి ఆస్పత్రికి తరలించిన మనసున్న నాయకుడు కేటీఆర్ అంటూ వారు ధన్యవాదాలు తెలిపారు.
On instructions of @KTRBRS Anna ,
— Aravind Alishetty (@aravindalishety) July 16, 2023
Admitted the Guy in hospital. He is Doing Great & His Health condition is normal Now.
Their Family members Thanked RamAnna For Helping Out the Man .#KTR #ManWithKindHeart pic.twitter.com/vdYCnaSg4R