Telugu Global
Telangana

రైతు ఆత్మహత్యలు.. అమిత్ షాకు కేటీఆర్‌ ప్రశ్నలు!

ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ను సైతం త‌న ట్వీట్‌కు జత చేశారు. ఇప్పుడు కేంద్రంలోని NDA సర్కార్‌ చెప్పింది అబద్ధమా.. లేక అమిత్ షా చెప్పింది అబద్ధమా..? అంటూ ప్రశ్నలు సంధించారు.

రైతు ఆత్మహత్యలు.. అమిత్ షాకు కేటీఆర్‌ ప్రశ్నలు!
X

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌. ఇందుకు సంబంధించి ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ను సైతం త‌న ట్వీట్‌కు జత చేశారు. ఇప్పుడు కేంద్రంలోని NDA సర్కార్‌ చెప్పింది అబద్ధమా.. లేక అమిత్ షా చెప్పింది అబద్ధమా..? అంటూ ప్రశ్నలు సంధించారు.

ఈ సందర్భంగా బీజేపీపైనా సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. బీజేపీని బక్వాస్ జూటా పార్టీగా అభివర్ణించిన కేటీఆర్‌.. ఆ పార్టీ డీఎన్‌ఏ మొత్తం అబద్ధాలు, మోసంతో నిండిపోయిందన్నారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌తోనే ఉంటారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.


కేటీఆర్‌ షేర్‌ చేసిన పేపర్ క్లిప్పింగ్‌లో ఏం ఉందంటే.. 2017 సంవత్సరంలో 900 మంది రైతులు ప్రాణాలు తీసుకోగా.. 2019 నాటికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 491కి పడిపోయినట్లు పార్లమెంట్‌ సాక్షిగా అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్ర‌భుత్వం సమాధానం ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు తగ్గించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రైతుబంధు స్కీమ్‌ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే రైతుల ఆత్మహత్యలు 45 శాతం తగ్గినట్లు రిపోర్టులో వెల్లడైంది.

First Published:  11 Oct 2023 6:06 AM GMT
Next Story