మరుగుజ్జులు, పిగ్మీలు, అడ్డమైన వెధవలు..
"కేసీఆర్ ముందు వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ్లు పెద్ద సిపాయిలట.. వీళ్లు రాష్ట్రాన్ని నడుపుతారట.. మనం చూడాలట." అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
ప్రతిపక్షాలపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్ష నేతలు మరుగుజ్జులు, పిగ్మీలు, అడ్డమైన వెధవలంటూ ధ్వజమెత్తారు. పోటీకి సమ ఉజ్జీలు ఉండాలని, ఈ మరుగుజ్జుగాళ్లతో మనకు పోటీ ఏంటని అన్నారు. షాద్ నగర్, వికారాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు.
Live: వికారాబాద్ బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి శ్రీ @KTRBRS#KCROnceAgain #VoteForCar https://t.co/EskOemiLIQ
— BRS Party (@BRSparty) October 5, 2023
మొనగాడు ఉండగా.. వెధవలెందుకు..?
మొనగాడు లాంటి కేసీఆర్ రాష్ట్రంలో ఉండగా.. ప్రతి నిర్ణయానికి ఢిల్లీపై ఆధారపడే అడ్డమైన వెధవలు మనకు అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్. మతం పేరుతో రాజకీయం చేసే, కులం పేరుతో విభజించే చిల్లర పార్టీ బీఆర్ఎస్ కాదని అన్నారు. అందర్నీ కలుపుకొని పోయి నడిచే పార్టీ అని వివరించారు. గరీబోడు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా.. వారిని ఆదుకోవాలన్నదే తమ దృక్పథం అని చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయానికి వస్తే.. దేవుడితోనైనా కొట్లాడటానికి వెనుకాడని పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు కేటీఆర్.
"కేసీఆర్ ముందు వీళ్లు రాజకీయ మరగుజ్జులు, పిగ్మీలు. వీళ్లు పెద్ద సిపాయిలట.. వీళ్లు రాష్ట్రాన్ని నడుపుతారట.. మనం చూడాలట." అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెసోళ్లకు బీజేపీ వాళ్లకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటుందని, టికెట్ల పంచాయితీ, పైసల వసూళ్ల పంచాయితీ అంతా ఢిల్లీలోనే అని చెప్పారు. సీట్లు, ఓట్లు అమ్ముకునే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మనకి అవసరమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీకి తన్ని తరిమేయాలన్నారు. ఎన్నికలు వచ్చిన వెంటనే సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్రామాల్లోకి వస్తారని, ఉపన్యాసాలతో ఊదరగొడతారని, ఆగం కాకండి.. ఆలోచించండి అని సూచించారు మంత్రి కేటీఆర్.