Telugu Global
Telangana

న‌డ్డా వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్‌.. - కేసీఆర్‌తో పెట్టుకున్న‌వారు ఏ ఒక్క‌రూ బాగుప‌డ‌లేద‌ని హెచ్చ‌రిక‌

నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.

న‌డ్డా వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఫైర్‌.. - కేసీఆర్‌తో పెట్టుకున్న‌వారు ఏ ఒక్క‌రూ బాగుప‌డ‌లేద‌ని హెచ్చ‌రిక‌
X

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వ్యాఖ్య‌ల‌కు మంత్రి కేటీఆర్ కౌంట‌రిచ్చారు. 23 ఏళ్ల కాలంలో కేసీఆర్‌తో పెట్టుకున్న‌ ఏ ఒక్క‌రూ రాజ‌కీయంగా బాగుప‌డ‌లేద‌ని మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. నాగ‌ర్ క‌ర్నూల్ స‌భ‌లో జేపీ న‌డ్డా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఘాటుగా స్పందించారు. నిన్న సభలో నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిపోయారు. కేసీఆర్‌ను జైల్లో పెడతామంటున్నారు.. అది ఎందుకో చెప్పాలని నిల‌దీశారు. పేద‌ల‌కు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్నందుకా..? కేసీఆర్ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా..? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్..? అని న‌డ్డాను ప్ర‌శ్నించారు. మాట్లాడడానికి ఓ హద్దు, అదుపు ఉండాల‌, కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్క‌రూ బాగుప‌డిన చ‌రిత్ర లేద‌ని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని.. ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వేసవి కాలంలో నీటి కొరత ఇబ్బందులను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.

రేవంత్ నీతి ముచ్చ‌ట్లు చెబితే.. మ‌నం వినాలా?

అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడితే.. హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల‌లో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని కేటీఆర్ కోరారు.

First Published:  26 Jun 2023 3:12 PM IST
Next Story