Telugu Global
Telangana

వీఆర్ ఏ లతో కేటీఆర్ చర్చలు

వీఆర్ ఏ ల సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ వారితో చర్చలు జరిపారు. మళ్ళీ 20వ తేదీన మరో సారి సమావేశమ‌వుదామని వీఆర్ ఏ లకు చెప్పిన కేటీఆర్ అప్పటి వరకు ఆందోళన విరమించాలని కోరారు.

వీఆర్ ఏ లతో కేటీఆర్ చర్చలు
X

ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, వేత‌నాల పెంపు త‌దిత‌ర స‌మ‌స్య‌లపై దాదాపు 50 రోజులకు పైగా ఉద్యమిస్తున్న వీఆర్ ఏ లు ఈ రోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వం దలాది మంది వీఆర్ ఏలు అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకొని లాఠీ చార్జ్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వీఆర్ ఏ లను చర్చలకు ఆహ్వానించారు.

కేటీఆర్ ఆహ్వానంతో వీఆర్ఏల ప్రతినిధులు చర్చలకు వెళ్ళారు. వాళ్ళ ప్రధాన సమస్యలైన ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, వేత‌నాల పెంపు తదితర అంశాలను కేటీఆర్ ముందు పెట్టారు. వాళ్ళు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ ఆ సమస్యలన్నింటినీ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన మరో సారి సమావేశమై ఈ అంశాల‌పై స‌మ‌గ్రంగా చర్చిద్దామని ప్రతిపాదించారు కేటీఆర్. దానికి ఒప్పుకున్న వీఆర్ ఏ లతో అప్పటి వరకు సమ్మె విరమించాలని కేటీఆర్ కోరారు. అయితే తాము తమ సంఘానికి చెందిన ఇతర నాయకులతో కూడా మాట్లాడి నిర్ణయం చెప్తామని వీఆర్ ఏ లు చెప్పారు.

First Published:  13 Sept 2022 3:21 PM IST
Next Story