Telugu Global
Telangana

జ్యూరిచ్ లో కేటీఆర్ క్రేజ్..

ఈ నెల 16 నుంచి 20 వరకు కేటీఆర్ దావోస్ సదస్సులో పాల్గొంటారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఎన్నారైలు మంత్రి కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.

జ్యూరిచ్ లో కేటీఆర్ క్రేజ్..
X

దావోస్ పర్యటనకోసం స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి కేటీఆర్ కి జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆయనకు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో సహా జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి కేటీఆర్ ని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

కేటీఆర్ తో ఫొటోలకోసం ఆసక్తి..

మంత్రి కేటీఆర్ తోపాటు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్నాథ్‌ రెడ్డి, లైఫ్‌ సైన్సెస్‌ విభాగం డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌, ఆటోమోటివ్‌ విభాగం డైరెక్టర్‌ గోపాల్‌ కృష్ణన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం దావోస్ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు వారు ఈ సదస్సులో పాల్గొంటారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత ఎన్నారైలు మంత్రి కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.


తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ బృందం స్విట్జర్లాండ్ లో అడుగు పెట్టింది. దావోస్ తాజా సదస్సు ముగిసే నాటికి మునుపటి కంటే ఎక్కువ పెట్టుబడులు ఈసారి తెలంగాణకు తరలి వస్తాయని అంచనా. అదే అంచనాతో కేటీఆర్ ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారు. ముందుగా జ్యూరిచ్ లో ఆయన బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నేతలు, అక్కడి తెలుగువారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత జ్యూరిచ్ నుంచి దావోస్ కి రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు కేటీఆర్.

First Published:  15 Jan 2023 10:04 PM IST
Next Story