సవాల్‌కు రాహుల్ గాంధీ సిద్ధమా- కేటీఆర్ ట్వీట్
కర్ణాటక యువతను సక్సెస్‌ఫుల్‌గా మోసం చేసిన రాజకీయ నిరుద్యోగి కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో పెద్ద పెద్ద హామీలు ఇస్తుందంటూ సెటైర్ వేశారు కేటీఆర్.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వాటిపై తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తెలంగాణ బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే కరెంటు విషయంలో కర్ణాటక రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని.. తెలంగాణలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ వస్తే ఇదే జరుగుతుందంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మరో అంశంపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. ఉద్యోగాల విషయంలో కర్ణాటక యువతను కాంగ్రెస్ మోసం చేసిందంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పులను కేటీఆర్ ట్వీట్‌కు యాడ్ చేశారు.
కర్ణాటక యువతను సక్సెస్‌ఫుల్‌గా మోసం చేసిన రాజకీయ నిరుద్యోగి కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో పెద్ద పెద్ద హామీలు ఇస్తుందంటూ సెటైర్ వేశారు కేటీఆర్. తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏదైనా రాష్ట్రాన్ని చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేటీఆర్.
After successfully fooling the youth of Karnataka, politically unemployed Scamgress is making tall promises in Telangana
— KTR (@KTRBRS) November 16, 2023
Can Rahul Gandhi show us any State in India that has completed more Govt sector recruitment than Telangana?#VoteForCar#TelanganaWithKCR pic.twitter.com/62h0njq5dp
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల 50 ఉద్యోగాలు భర్తీ చేస్తామని కర్ణాటకలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అయితే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే దాదాపు 6 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తడం లేదంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగ బస్సు యాత్రను సైతం కాంగ్రెస్ ప్రారంభించింది.