Telugu Global
Telangana

కంటోన్మెంట్ సమస్యలపై కేంద్రం మెడలు వంచుతాం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ. 400 ఉన్న సిలిండర్‌ ధర రూ.1200 పెంచిందని, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, పాలు, అన్ని ధరలు జీఎస్టీ పేరుతో పెంచిన ఘనత ఆయనదేనని విమర్శించారు కేటీఆర్. ధరలను పెంచిన బీజేపీని బొంద పెట్టవలసిన అవసరం ఉందన్నారు.

కంటోన్మెంట్ సమస్యలపై కేంద్రం మెడలు వంచుతాం
X

కేంద్రం మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చినట్టుగానే.. మరోసారి కేంద్రంతో యుద్ధం చేసి కంటోన్మెంట్‌ లోని పేదలకు పట్టాలు కూడా ఇప్పిస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్‌ ఏరియా కేంద్రం పరిధిలో ఉండడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికి అప్పగించాలని అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు కేటీఆర్. ప్రధాన మంత్రిని 10సార్లు కలిశామని, కంటోన్మెంట్‌ లోని 100 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్రానికి 500 ఎకరాలు ఇస్తామని చెప్పామని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ లోని కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు. సాయన్న కుమార్తె లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.



పిరమైన మోదీ..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ. 400 ఉన్న సిలిండర్‌ ధర రూ.1200 పెంచిందని, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు, పాలు, అన్ని ధరలు జీఎస్టీ పేరుతో పెంచిన ఘనత ఆయనదేనని విమర్శించారు కేటీఆర్. ధరలను పెంచిన బీజేపీని బొంద పెట్టవలసిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కొత్త కార్యక్రమాలు తీసుకు రాబోతున్నామని, ఈసారి కోడళ్ల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ప్రవేశ పెడతున్నామని పేర్కొన్నారు. జనవరిలో కొత్త పెన్షన్‌ లు, కొత్త రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్‌ లు ఇస్తామని హామీనిచ్చారు కేటీఆర్. జనవరి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.

మూడోసారి అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలు పెంచుతున్నామని చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబ పెద్దకు రూ. 5లక్షల బీమా ఇవ్వబోతున్నామని అన్నారు. అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు.

First Published:  21 Nov 2023 9:59 PM IST
Next Story