జల్, జంగల్, జమీన్.. సాకారం చేశాం
రాష్ట్రంలోని 1.51 లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులకు 4 లక్షల ఎకరాల భూమికి ఏక కాలంలో హక్కు పత్రాలు అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశ చరిత్రలోనే పోడు పట్టాల పంపిణీ సువర్ణాధ్యాయమని అన్నారు.
మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లెల్ల గ్రామంలోని వ్యవసాయ కాలేజీలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పించారు. కలెక్టరేట్ లో 124 మంది చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చెక్కులు అందించారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు కొనుగోలు చేసిన పల్లె వెలుగు బస్సును ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని 1,614 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు ఇలాంటి అద్భుతమైన రోజులు అరుదుగా వస్తుంటాయని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
A typical day of a person in public life
— KTR (@KTRBRS) July 6, 2023
Straddling different worlds and diverse communities pic.twitter.com/N9R84mO0jx
పోడు భూములకు పట్టాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం జల్, జంగిల్, జమీన్ నినాాదాన్ని సాకారం చేసిందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆదివాసీ, గిరిజనుల గుండె చప్పుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలోని 1.51 లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులకు 4 లక్షల ఎకరాల భూమికి ఏక కాలంలో హక్కు పత్రాలు అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. దేశ చరిత్రలోనే పోడు పట్టాల పంపిణీ సువర్ణాధ్యాయమని అన్నారు.
దళిత సమాజంలో పరివర్తన తేవాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ సాహోసోపేత నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు మంత్రి కేటీఆర్. రెండో విడతలో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున దళితబంధు యూనిట్లు ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మరోవైపు ప్రైవేటు రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లెల్ల వ్యవసాయ కాలేజీని మించిన మరో కాలేజీ దేశంలోనే లేదన్నారు కేటీఆర్.