Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ బర్త్ డే స్పెషల్.. ఆ నిర్ణయం ఏంటంటే..?

ప్ర‌తి రోజు గెల‌వాల‌నుకునే పిల్ల‌ల క‌ల‌ల‌ను సాకారం చేసే దిశ‌గా ముందడుగు వేయాలన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ మెసేజ్ లు హోరెత్తిపోతున్నాయి.

మంత్రి కేటీఆర్ బర్త్ డే స్పెషల్.. ఆ నిర్ణయం ఏంటంటే..?
X

రేపు(జులై-24) మంత్రి కేటీఆర్ 47వ పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆయన గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ పుట్టినరోజు కూడా ఆయన ఓ రెజల్యూషన్ తీసుకున్నారు. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో యూసుఫ్‌ గూడ‌లో నిర్వహిస్తున్న స్టేట్ హోంలోని అనాథ పిల్ల‌ల‌కు త‌న వంతు సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.


47వ పుట్టినరోజున 47మందికి

47వ పుట్టినరోజు సందర్భంగా.. 47మంది ప్రతిభావంతులైన పిల్లలను ఎంచుకుని వారి చదువుకి పూర్తి సాయం చేస్తానని ట్వీట్ చేశారు కేటీఆర్. టెన్త్, ఇంటర్ చదువుకునే విద్యార్థులనుంచి 47మందిని ఎంపిక చేసి వారికి అండగా నిలబడతానన్నారు. వారితోపాటు మరో 47మంది వృత్తివిద్యా కోర్సులు చదువుకునే విద్యార్థులకు కూడా తనవంతు సాయం చేస్తానని చెప్పారు. విద్యార్థులు ఒక్కొకరికి ఒక్కో ల్యాప్ టాప్ బహూకరిస్తానన్నారు. వారి భవిష్యత్ కోర్సులకు, లేదా ఉద్యోగాలకు సంబంధించి రెండేళ్లపాటు శిక్షణ కూడా ఇప్పిస్తానని చెప్పారు.

ప్ర‌తి రోజు గెల‌వాల‌నుకునే పిల్ల‌ల క‌ల‌ల‌ను సాకారం చేసే దిశ‌గా ముందడుగు వేయాలన్నారు మంత్రి కేటీఆర్. త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ప్ర‌క‌ట‌నల కోసం డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌కుండా.. ఎవ‌రికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్ల‌ల‌కు స‌హాయం చేయాల‌ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌ను కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ మెసేజ్ లు హోరెత్తిపోతున్నాయి. గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా తాము చేయాలనుకుంటున్న మంచి పనుల్ని మంత్రి కేటీఆర్ కి మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు అభిమానులు.

First Published:  23 July 2023 9:39 PM IST
Next Story