కాంగ్రెస్ కొత్త సీసాలో పాత సరుకు..
24 గంటల విద్యుత్ సరఫరా లేదని అంటున్న కాంగ్రెస్ వాళ్లకోసం తాను 2 బస్సులు పెట్టిస్తానని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆ బస్సుల్లో వారు చెప్పిన ఊరికి తీసుకెళ్తానని, వాళ్లకు నచ్చిన ఊరిలో కరెంటు వైర్లు పట్టుకోవాలని, దరిద్రం వదిలిపోతుందని కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదని, ఇప్పుడు తమ హయాంలో విద్యుత్ వ్యవస్థను చక్కబరిచి రోజుకి 24గంటలు సరఫరా చేస్తుంటే.. మధ్యలో వచ్చి మళ్లీ 3 గంటలే అంటున్నారని మండిపడ్డారు. పైగా 3 గంటల విద్యుత్ సరిపోవాలంటే 10హెచ్.పి. మోటార్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని, అసలు రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్.
అశ్వరావుపేట రోడ్ షో లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS#VoteForCar #KCROnceAgain https://t.co/y1BxjV78fU
— BRS Party (@BRSparty) November 19, 2023
2 బస్సులు పెట్టిస్తా రండి..
24 గంటల విద్యుత్ సరఫరా లేదని అంటున్న కాంగ్రెస్ వాళ్లకోసం తాను 2 బస్సులు పెట్టిస్తానని చెప్పారు మంత్రి కేటీఆర్. ఆ బస్సుల్లో వారు చెప్పిన ఊరికి తీసుకెళ్తానని, వాళ్లకు నచ్చిన ఊరిలో కరెంటు వైర్లు పట్టుకోవాలని, దరిద్రం వదిలిపోతుందని కౌంటర్ ఇచ్చారు. రైతుల కళ్ళలో కన్నీరు మిగిల్చిన కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్.
డబ్బు సంచులు చూసి భయపడొద్దు..
కాంగ్రెస్ వాళ్ల డబ్బుసంచులు చూసి భయపడొద్దని అన్నారు మంత్రి కేటీఆర్. అశ్వారావు పేటలో మెచ్చా నాగేశ్వరరావుని గెలిపించాలని ప్రజల్ని కోరారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 చేస్తామన్నారు. డిసెంబర్ 3 తర్వాత ప్రతి ఇంటికి రూ.5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు కేటీఆర్. అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తామన్నారు. అశ్వరావుపేటని మున్సిపాల్టీ చేస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తం గులాబీ గాలి వీస్తోందని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మొద్దన్నారు కేటీఆర్.